రైతుబిడ్డ అయిన నాలుగు నెలల నాగలోకేష్కు రెండు వారాల్లోపు కాలేయ | Milaap
loans added to your basket
Total : 0
Pay Now

రైతుబిడ్డ అయిన నాలుగు నెలల నాగలోకేష్కు రెండు వారాల్లోపు కాలేయ మార్పిడి అత్యవసరం.

"నాగ లోకేష్ పుట్టినప్పట్నుంచి జ్వరము కలిగి బాధపడుతూ ప్రతి రాత్రి, అలా ఏడుస్తూ మమ్మల్ని మెలుకువగానే ఉంచేవాడు. అతను పాలు త్రాగిన తరువాత, తన కడుపు కొద్దిగా ఉబ్బరంగా కనిపించేది. అది చూసిన మేము చాలా బయపడేవాళ్ళము," - కిరణ్, లోకేష్ తండ్రి

నాగ లోకేష్ తన తల్లిదండ్రుల వివాహానికి ఏడు సంవత్సరాల తరువాత జన్మించిన 4 నెలల వయసుగల ఒక పసిబిడ్డ. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో తన తల్లిదండ్రులతో బాటుగా ఆ పసిబిడ్డ నివసిస్తున్నాడు. అతను కాలేయ వైఫల్యం కలిగి ఉండడం వలన ఒకవేళ తన పరిస్థితి హఠాత్తుగా హానికరమైనదిగా మారితే అతని తల్లిదండ్రులు తనను తీసుకొని సమయానికి ఆసుపత్రికి చేరుకోలేకపోతామేమోనని వారి యొక్క నిరంతర భయము. లోకేష్ను ముందుగానే బ్రతికించుకోవడానికి అతనికి కాలేయ మార్పిడి చాలా అవసరం.

కొన్ని నెలల పాటుగా, వైద్యులు ఆ పసిబిడ్డకి ఏ లోపము లేదని తన తల్లిదండ్రులతో చెప్పారు


లోకేష్ జన్మించడం వారి కుటుంబంలో చాలా సంతోషకరమైన ఒక సంఘటన. చాలా సంవత్సరములు వేచి ఉన్న తరువాత కిరణ్ చైతన్యలకు కలిగిన మొట్ట మొదటి సంతానం. వారి బిడ్డ పసుపు కళ్లతో అనారోగ్యంగా ఉండడం వారు చూసి, వంటనే తెనాలిలోనున్న ఒక ఆసుపత్రికి తనని తీసుకువెళ్ళారు - (వారి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక పట్టణం) అక్కడి వైద్యులు ఆ పసిబిడ్డకు కొద్ధిగా కామెర్లు ఉండవచ్చని చెప్పారు.


“సూర్యుని కిరణాలు అతనిపై పడేందుకు తనని బయట ఉంచమని వైద్యులు మాకు చెప్పారు. కానీ, రెండు వారాల తరువాత అతను మళ్ళ్లీ వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు వెంటనే మేము మా బిడ్డని ఒక వైద్యుని దెగ్గరికి తీసుకుని వెళ్ళాము అయితే అక్కడ ఆమె కూడా మాకు కొన్ని మందులు ఇచ్చి మమ్మల్ని తిరిగి వెళ్ళమని కోరింది. రోజు రోజుకి అతని ఆరోగ్యం మరింత అధ్వాన్నంగా ఉండడం వలన, తనను తీసుకొని మేము విజయవాడకు వచ్చాము - ఇక్కడ వైద్యులు తనకు కాలేయ మార్పిడి చేయడానికి ఒక నెల మాత్రమే గడువుందని మాకు చెప్పారు," - కిరణ్.


ప్రతీ సారీ పాలు పట్టించినప్పుడుల్లా ఆ పసిబిడ్డ లోకేష్ కడుపు చాలా అసాధారణంగా మారుతుంది

ఇప్పటికే కిరణ్ భారీగా అరువు తెచ్చుకున్నందువలన, ఇకపై నిధులు ఏర్పాటు చేయడానికి ఎలాంటి మార్గం లేదు


కిరణ్ రోజువారీ పని చేసి రూ.400 సంపాదించే ఒక రైతు. తన దాచి పెట్టిన డబ్బంతా బిడ్డ చికిత్స కోసం ఖర్చు చేసి ఇప్పటికే స్థానిక రుణదాతల నుండి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తనికి తెలిసిన ప్రతి ఒక్కరిని డబ్బు సహాయం చేయమని అడిగాడు కానీ అతని మొదటి శిశువును కాపాడుకోవటానికి సమయానికి 18 లక్షల రూపాయలు ఏర్పాటు చేయటం అతనికి చాలా కష్టం."నేను సహాయం కోసం అనేక మంది దెగ్గర వేడుకొని మరియు వారి ముందు కంట తడి పెట్టుకున్నాను. నా భార్య కృంగిపోయి మా పసిబిడ్డను కాపాడటానికి ఏధైనా చేయమని నాకు చెప్పేది. అతి చిన్న వయసులోనే మా బిడ్డ చాలా బాధలను అనుభవించాడు - మా బిడ్డను రక్షించటానికి అన్ని విధాలుగా తోడ్పడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. అయితే ఇప్పుడు ఇంకేమి చెయ్యాలో నాకు తెలియట్లేదు," – కిరణ్.

అతని తల్లిదండ్రులు కాలేయ మార్పిడిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఆ పసిబిడ్డకు ఇచ్చిన గడువు కాలం చాలా వేగంగా దెగ్గర పడుతోంది


"నేను నా భార్య కలిసి కాలేయం విరాళంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, అయితే ఇందుకు పరీక్ష చేయుటానికి కూడా మూడు లక్షలు అవసరం ఇందువలన మేము ముఖ్యమంత్రి నుండి వచ్చే నిధుల కోసం కూడా దరఖాస్తు చేసాము, ఇది సమయానికి అందినట్లయితే మాకు కొంత ఉపశమనం కలిగి ఇందుకు మేము పరీక్ష చేయించుకోవచ్చు. ప్రతిరోజూ అతను కొద్ది పాటుగా నవ్వుతూ, అలా ఎక్కువ సేపు ఏడుస్తుంటే దాని గురించి చింతిస్తూ ఏమి చెయ్యాలో తెలియక మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం," – కిరణ్.

మీరు ఎలా సహాయం చేయగలరు


అతని కోసం కొన్ని సంవత్సరాలు ప్రార్ధించిన తరువాత లోకేష్ తన తల్లిదండ్రులకు జన్మించాడు. సమయానికి ఒక కాలేయ మార్పిడి ఏర్పాట్లు చేయలేకపోతే, అతని జీవితం నిరాశకు గురవుతుంది. లోకేష్ తన రోజులను చాలా నొప్పి మరియు అసౌకర్యంతో గడుపుతున్నాడు. ఆ పసిబిడ్డకు సమయానికి కాలేయ మార్పిడి చేసినట్లయితే అతను కోలుకోవడానికి మంచి అవకాశం ఉన్నది.

ఈ చిన్నారి లోకేష్ యొక్క జీవితమునకు సహాయపడి మరియు రక్షించండి.Supporting Documents


The specifics of this case have been verified by the medical team at the concerned hospital. For any clarification on the treatment or associated costs, contact the campaign organizer or the medical team.


Click here to save Naga Lokesh