Save Baby Sriyansh | Milaap
This is a supporting campaign. Contributions made to this campaign will go towards the main campaign.
Save Baby Sriyansh
  • Krishnaveni

    Created by

    Krishnaveni Thangella
  • S

    This fundraiser will benefit

    Sriyansh

    from Banjara Hills, Hyderabad

ప్రాణంగా పెంచుకున్న పిల్లాడు చావుతో పోరాడుతుంటే..

కడుపున పుట్టిన బిడ్డకు చిన్న నొప్పి కలిగినా భరించలేం. మనం ప్రాణం అడ్డుగా పెట్టయినా.. వారిని కాపాడాలని తాపత్రయ పడుతుంటాం. పగవారికి రాకూడదని కోరుకునే ఇలాంటి బాధతో.. ఆ తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. ప్రాణంగా పెంచుకున్న పిల్లాడు చావుతో పోరాడుతుంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డను రక్షించే దాతల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు

పేదోడికి కష్టాలు రావొచ్చు గానీ.. రోగాలు రాకూడదంటారు. కానీ.. ఆ కుటుంబానికి అదే జరిగింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యమో.. దేవుడు విధించిన శిక్షో తెలియదు కానీ.. రెండేళ్లు కూడా నిండని చిన్నారి.. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అపస్మారక స్థితిలో ఉండటంతో.. అతడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ బిడ్డను కాపాడే దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన 22 నెలల బాలుడు శ్రియాన్ష్‌.. ఈనెల 13న ప్రమాదవశాత్తు డే కేర్‌ సెంటర్‌లో నిల్వ ఉంచిన టర్పెంటైన్‌ ఆయిల్‌ తాగాడు. దీంతో తల్లిదండ్రులు అతడ్ని బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ ఆస్పత్రికి తరలించారు. టర్పెంటైన్‌ ఆయిల్‌ మింగడంతో శ్రియాన్ష్‌ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో బ్రెయిన్‌కు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా కాకపోవడంతో.. చిన్నారి ఆరోగ్యం విషమంగా మారింది. అతడ్ని బతికించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న డాక్టర్లు.. వారం రోజులుగా అత్యాధునిక ఎక్మో మెషీన్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న శ్రియాన్ష్‌కు.. కృతిమంగా శ్వాస అందిస్తున్నారు. బాలుడు పూర్తిగా కోలుకోవాలంటే.. మరో నెల రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాలని డాక్టర్లు వెల్లడించారు.

మరోవైపు శ్రియాన్ష్‌ కోలుకోవడానికి 30 లక్షల దాకా ఖర్చవుతుందని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో.. బాలుడి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రియాన్ష్‌ తండ్రి నవీన్‌కుమార్‌.. చావుబతుకుల్లో ఉన్న కొడుక్కి ట్రీట్‌మెంట్‌ చేయించలేక నరకం అనుభవిస్తున్నాడు. శ్రియాన్ష్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మిలాప్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌.. అతడ్ని బతికించేందుకు విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. నెల రోజుల్లో 30 లక్షల రూపాయలు సమకూర్చేలా దాతలు ముందుకు రావాలని ఫైండ్‌ రైజింగ్‌ కార్యక్రమం మొదలుపెట్టింది. ట్రీట్‌మెంట్‌కు తక్కువ సమయం ఉండటంతో.. వీలైనంత ఎక్కువమంది త్వరగా స్పందించాలని మిలాప్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు కోరుతున్నారు.

శ్రియాన్ష్‌ ట్రీట్‌మెంట్‌ కోసం సహాయం చేయాలనుకుంటున్న దాతలు.. నేరుగా బాలుడి తండ్రి నవీన్‌కుమార్‌ పేరుమీద ఉన్న ఎస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేయొచ్చని మిలాప్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఎస్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ 8080 811 040059. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ YESB0CMSNOC. శ్రియాన్ష్‌ను కాపాడేందుకు దాతలు తమకు తోచినంత సహాయం చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

http://www.tv5news.in/newsdetails.aspx?ID=102316&SID=6&Title=baby-hospitalised-after-being-consumption-Turpentine-oil

Read More

Know someone in need of funds? Refer to us
support