మీ సహృదయ సాయంతో ఈ పదమూడేళ్ళ విద్యార్థికి కాలేయ చికిత్సతో | Milaap
loans added to your basket
Total : 0
Pay Now

మీ సహృదయ సాయంతో ఈ పదమూడేళ్ళ విద్యార్థికి కాలేయ చికిత్సతో పునర్జీవితం ప్రసాదించండి

సంవత్సరం నుంచీ పాఠశాలకు వెళ్ళక, ఆరోగ్యంసరిగా లేక, చిన్నారి నాగేంద్ర(బాబీ)  కుమిలిపోతున్నాడు. స్వతహాగా బాబీ నిదానస్తుడు.

చక్కగా ఆలోచించి మాట్లాడతాడు, కుదిరితే సాయం చేస్తాడు తప్ప ఎవరితోనూ చిన్న గొడవ కూడా పెట్టుకోడు. తోటి విధార్థులతో కలిసి మెలిసి చదువుకునేవాడు. సినిమాలు,ఐస్క్రీమ్,క్రికెట్,పండగలుఇష్టం. వారి తరగతిలో ఆ బాలుడే ప్రతి సంవత్సరం ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యెవాడు.సైన్స్అంటే చాలా ఇష్టపడి చదివేవాడు. కానీ ఆవిధాత తన జీవితాన్నే మధ్యలో మార్చెసాడు.


ఏడ్చినా,అమ్మానాన్నల నిస్సహాయ చూపులు, బేల ఓదార్పుల కన్నా నొప్పి భరించడమే అతడికి మంచిదిగా తోచింది, ఏడవడం మానేసాడు. అంటే మెల్లగా నొప్పి ని అలవాటు చేసుకున్నాడు.

చతనత ప్పేమీ లేదన్నట్టు పైరగాలి కూసంత ఓదార్పు నిస్తుంది,అమ్మజోల పాడుతుంది. కానీ బాల్యాన్నీ,భవిష్యత్తునీ తినేసింది ఓనయంకాగల జబ్బు .  పదిహేను రోజుల  హాస్పిటల్, పదమూడు లక్షల అప్పు అతడికి ఓస దావకాశాన్ని మాత్రమే ఇచ్చాయి,ఆరోగ్యంకాదు.ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ లో డాక్టర్లు సర్జరీ తప్పనిసరి అంటున్నారు. బాబీకి పూర్తిగా నయమవుతుందని డాక్టర్సింఘ్ నమ్మకం. కాలేయానికి(లివర్)ఆపరేషన్అంటే మాటలుకాదు,చాలాఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అన్నీ ఉన్నా అరచేతిలో శని అన్నట్లు పేదరికం వల్ల ఆ చిన్నారి నీ,అతడి కుటుంబాన్నివిధి వెక్కిరిస్తుంది.దాతల కోసం ఈ పసివాడు ఎదురు చూస్తున్నాడు.

“నా కుమారు ని చూస్తే గుండెతరుక్కు పోతుంది. వాడు ఎప్పుడూ చదువుతూ కానీ ఆడుతూ కానీ ఉండేవాడు.ఇంట్లో కూర్చుంటే వేమన రాసిన శతక పద్యాలను గట్టిగా చదివించేదాన్ని.ఇప్పుడు దానికి కూడా ఓపిక లేదంటున్నాడు. మంచం  దిగట్లేదు. చూస్తుండగానే రోజు రోజు కీ శరీర అవయవాలు సన్న బడుతున్నాయి. ఏది తిన్నా జీర్ణం  కావటం లేదు. నిద్ర సమయం లో కలవరి స్తున్నాడు. రాత్రి కలవరి స్తున్నాడు. జన్మనిచ్చాను కానీ కడుపు నిండా అన్నంకూడా పెట్ట లేక పోతున్నా. భయమేస్తుంది." - దేవి(అమ్మ)

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో ఎలెక్ట్రీషియన్గా పనిచేస్తున్న వీర్రాజు కొడుకు

బాబీకి  ఆట, పాట, చదువు, స్నేహితులు, తమ్ముడు అనే ప్రపంచంలో నుంచి ఒక్క ఉదుటున అన్నీ దూరం అయ్యాయి. డాక్టర్లు బయాప్సీ చేసి కాలేయ సమస్య అని తేల్చారు. పరీక్ష జరిగి కొద్ది రోజులే అయింది. ఎడ తెరపి లేని వీరేచనాలతో మొదలయిన జబ్బు జవాజీవాల నుతి నేస్తుంది. తమ్ముడు, స్నేహితులు స్కూల్కి వెళ్తే, తనొక్కడు ఇంటి పట్టున మంచం మీద పడుకొని ఉంటాడు. ఎంతో కష్టం చేస్తే పదినిమిషాలు మాత్రమే నిలిచుండ గలుగు తున్నాడు. చివరికి బట్టలు కూడా వదులయి పోయాయి. ఎప్పుడు ఏం అవుతుంద నిభయ మేస్తుంది. వింత వ్యాధితో దేవుడు మాకు పరీక్ష పెడుతున్నాడు అంటున్నాడు బాబీ తండ్రి వీర్రాజు.

“పేదవాళ్ళం, దేవుడు మాకే ఈ పరీక్ష ఎందుకు పెడుతున్నాడు. ఎవరినీ ఎప్పుడూ నేను బాధ పెట్టలేదు. బాబీ తల్లి కూడా మానసికంగా క్రుంగి పోయి రెండు సార్లు మంచాన పడింది. బాబీ గాడు అలా మంచం మీద పడి ఉంటే ఏమీ చెయ్యాలో తెలియట్లేదు.నేను చేసేది అంతా చేసా. నాలి వర్తీ సుకోమన్నాను. డాక్టర్లు పనికి రాదు అన్నారు.అప్పు చేసా,ఇల్లు తాకట్టు పెట్టాను. మా కుటుంబం రోడ్డు న పది ఉంది. బాబీ సంతోషంగా ఉంటె య్చాలు అనుకున్నాను.ఇంక నేనేం చెయ్య లేక పోతున్నా,చాలా కష్టంగా ఉంది." - వీర్రాజు(నాన్న)


బిడ్డ  కోసం ఇల్లు తాకట్టు పెట్టి మద్రాసులో పదిలక్షలు, హైదరాబాదు లో మూడు లక్షలు ఖర్చు చేసి వీర్రాజు  కొడుకు ని బ్రతికించుకున్నాడు ఇప్పటి వరకు. స్తోమత కు మించి ప్రయత్నించి న వీర్రాజుకు డాక్టర్లు ఒక్క అవకాశం వరంగా ఇచ్చారు. కానీ ఎన్నో వారాలు ఆసుపత్రుల్లో గడిపి తిరిగి స్వగ్రామానికి చేరుకుంటే అతడికి ప్రశ్నలు, కష్టాలు తప్ప సమాధానాలు లేవు, అగమ్యగోచరం. అతడిప్పుడు అచేత ను డైసిగ్గేసినా తప్పక, కొడుకు మీద తీపి తో ఆవరం లాంటి సర్జరీ తో తన బిడ్డ ను దక్కించమని వేడుకొంటూ చేతులు చాచి మన ముందు నిలుచున్నాడు. ఈ తల్లి దండ్రుల చివరి ఆశమనలో నిమంచి తనం, జాలి మీదనే పెట్టుకున్నారు.

దాతలైన మీరు ఒక్క అడుగు ముందుకు వేసి ప్రాణ దానంచేయండి,బాబీ కుటుంబాన్నికాపాడండి.


ఆసుపత్రిలోని వైద్య బృందం ఈ కేసు యొక్క వివరాలను ధృవీకరించింది. చికిత్స లేదా సంబంధిత వ్యయాలపై ఏదైనా వివరణ కోసం, ప్రచార నిర్వాహకుడిని లేదా వైద్య బృందాన్ని సంప్రదించండి.

నాగేంద్రకు సహాయం చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చేయండి.