1-Year-Old Who Cries In Pain Will Die Of Cancer Without | Milaap
1-Year-Old Who Cries In Pain Will Die Of Cancer Without Treatment
  • P

    Created by

    Praneetha
  • A

    This fundraiser will benefit

    Ayaan

    from Banjara Hills, Hyderabad

“నొప్పి కారణంగా మా బిడ్డ గంటల తరబడి అలా ఏడుస్తూ ఉండగా. వాడిని ఆ బాధ నుండి కాపాడలేని వారయ్యాము. నేను మా బిడ్డ కోసం పాట పాడి, బయటకి కూడా తీసుకొని వెళ్ళేవాడిని, కానీ ఏ మాత్రం లాభం లేదు. తను ఇంజక్షన్ వేసుకున్న ప్రతిసారి బాధతో ఏడుస్తూ అలసిపోయి నా తొడలపై అలాగే నిద్రపోయేవాడు. దీని వలన ఎక్కడికి  కదల్లేక పోయేవాడిని. క్యాన్సర్కి ముందు తను చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉండే పసిబిడ్డ. అటువంటి ఒక శిశువు క్యాన్సర్ అను వ్యాధికి గురయ్యాడన్న మాట వినగానే మేమందరం ఒక సారి ఆశ్చర్యపోయాము. మా బిడ్డ చికిత్స ప్రారంభించటానికి ఎటువంటి సమయమును వృధా చెయ్యలేదు కానీ ఇప్పుడు ప్రతి మార్గములోను మేము అలసిపోయాము, ఇక పై  చికిత్స చెయ్యకపోతే ఎప్పటికి అయాన్ని మేము కోల్పోతాము.” - సదయ్య


కేవలం కొన్ని నెలల క్రితం నుండే ఆ పసిబిడ్డ తప్పటి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. సదయ్య మరియు రమదేవీల చిన్న ఇంట్లో తన ముసిముసి నవ్వులు  నిండి ఉండేది. ఆ బిడ్డ తప్పటడుగులతో  కొన్నిసార్లు జారుతూ మరి కొన్నిసార్లు పడుతూ ఇంటి చుట్టూ తిరుగుతు ఉండేవాడు, కానీ ఇప్పుడు అయాన్ ఎవరి సహాయం లేకుండా కనీసం కూర్చో లేకపోతున్నాడు. అతని తల్లిదండ్రులు ఆ శిశువును అన్ని చోట్లకి తీసుకుని వెళ్తున్నారు. క్యాన్సర్ కారణంగా బాధపడుతున్న పసిబిడ్డ నవ్వులకు బదులుగా తన ఏడుపులు గట్టిగా వినిపిస్తోంది. సదయ్య, రమదేవిల ఏకైక బిడ్డను వారు ఎక్కడ కోల్పోతారేమోనాన్న ఆలోచనతో బాధపడుతున్నారు.

కేవలం జ్వరం ఒక ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది

జ్వరం వలన రమాదేవి తన బిడ్డను వైద్యుని దెగ్గరికి తీసుకువెళ్లింది, ఇది రెండు రోజుల్లో నయమైపోతుంది అనగానే దాని గురించి ఆమె ఆందోళన చెందలేదు. దురదృష్టవశాత్తు, అతని జ్వరం కనికరంలేనిదిగా నిరూపించబడింది. ఇందువలన అయ్యాన్కు విశ్రాంతి లేక రోజు రోజుకి చాలా బలహీనుడై మరియు నిశ్శబ్దంగా ఉండేవాడు.



"మా పసిబిడ్డకి జ్వరం తగ్గకపోయేసరికి నేను చాలా భయపడిపోయాను కానీ అది క్యాన్సర్గా మారుతుందని నేను ఎన్నడు ఊహించలేదు. తన రక్త పరీక్ష ఫలితాలు కోసం మేము వైధ్యుని దెగ్గరకు వేచి ఉనప్పుడు నేను తప్పు చేశానేమోనని భయపడ్డాను. అయాన్ మాకు మొదటి సంతానం, తన తల్లిదండ్రులుగా మేము ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకునే వాళ్ళము. నేను తనకి సమయానికి పాలు పట్టించక పోవడం వలన తను చాలా బలహీనంగా ఉన్నాడా? అని నేను తరచుగా భావించాను. వైద్యులు మా అయాన్కి క్యాన్సర్ వ్యాధి ఉందని చెప్పగానే మేము చాలా ఆశ్చర్యపోయాము. అప్పటి నుండి, ప్రతి రోజు తనని ఎక్కడ కోల్పోతామెమోనని ఆందోళన చెందుతున్నాం." - రమాదేవి


పాఠశాల ఉపాధ్యాయుడిగా సదయ్య జీతం వారి శిశువు యొక్క జీవిత-రక్షణ చికిత్స కొనసాగించడానికి సరిపోదు హైదరాబాద్ లోని ఒక పాఠశాలలో సదయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు

ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి వెళ్లి అతడు తన బిడ్డతో ఆడుకోవటానికి ఆతురతగా ఎదురు చూస్తుంటాడు. ఆ పసిబిడ్డ ఆయాన్ చికిత్స పొందే సమయములో చూసుకోవడానికి సదయ్య పాఠశాల నుండి నేరుగా ఆసుపత్రికి వెళ్ళేవాడు. తన బిడ్డ చాలా ఇబ్బంది పడుతున్నపుడు, కనీసం పాఠశాలకు కూడా వెళ్ళ లేకపోయేవాడు. సదయ్య నెలకు రూ. 15,000 సంపాదిస్తూ తను పొదుపు చేసి దాచుకున్న రెండు లక్షల రూపాయాలను బిడ్డ చికిత్సకు ఖర్చు చెయ్యగలిగాడు. వారి దెగ్గర ఉన్న డబ్బంతా బిడ్డ చికిత్స కోసం వారు ఖర్చు చేశారు.



సాధ్యమైనంత వరకు, తను కీమోథెరపీ చికిత్స పొందుతునప్పుడు మా బిడ్డతో ఉండడానికి, మేమిద్దరం కలిసి ఆసుపత్రికి తీసుకువెళ్లేవాళ్లము. కొన్నిసార్లు తను నిద్ర పోయేవాడు కానీ ఇతర సమయాల్లో ఏడుస్తూ బాగా అలసిపోయేవాడు. మా బిడ్డకి ఒక నెల చికిత్స మాత్రమే మేము అందించగలిగాము, అయితే ఇప్పుడు తన చికిత్సని కొనసాగించ లేకపోతున్నాము. మేము కొంత డబ్బు సంపాదించటానికి మాకున్న ఒక బైక్ను కూడా  అమ్మేశాము  మేము ఇప్పుడు ఖర్చు పెట్టబోయే ప్రతి రూపాయి గురించి మరొకసారి ఆలోచించాలి. తన చికిత్స కోసం అయ్యే తొమ్మిది లక్షల రూపాయలను మేము ఇకపై భరించలేము.”

 అయాన్ యొక్క తల్లిదండ్రులు మీరు ఎలా సహాయపడగలరు

రోగనిర్ధారణ తర్వాత వెంటనే ఆ పసిబిడ్డ అయాన్కు కీమోథెరపీ ఇవ్వటం ప్రారంభించారు అయినప్పటికీ, తన బిడ్డని క్యాన్సర్నుండి రక్షించటం కోసం తరువాత 6 నెలల వరకు తీవ్ర కీమోథెరపీని ఇవ్వవలసిన అవసరం ఉన్నది. తను గడిపిన రోజులు బాధ తప్ప మరేమీ లేని ఆ పసికందు వయసు కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే. ఆ పసిబిడ్డ అయాన్ యొక్క పూర్తి జీవితము ఇకపై ముందుకు సాగాలి, కానీ చికిత్స లేకుండా, అతను మరణాన్ని ఎదుర్కుంటున్న సదయ్య రమదేవీల ఏకైక సంతానాన్ని వారు కాపాడుకోవటానికి చాలా తక్కువ సమయం మిగిలి  ఉన్నందున వారు సహాయం కోసం నిరాశగా ఎదురు చూస్తున్నారు.

మీ మద్దతు ఈ పసిబిడ్డ అయాన్ యొక్క జీవితాన్ని కాపాడుతుంది.

Read More

Know someone in need of funds? Refer to us
support