Ranjithkumar's online fundraiser for Medical | Milaap
This 22 Years Old Needs Your Urgent Support In Fighting Lymphoma Cancer
0%
Be the first one to donate
Need Rs.3,50,000
  • Ranjithkumar

    Created by

    Ranjithkumar
  • SM

    This fundraiser will benefit

    Sujatha Manubothula

    from Thimmampet, Telangana

Story

My name is Ranjith Kumar and I am here to raise funds for my friend Sujatha Manubothula who is 22 years old. We both live in the same neighborhood.

I've known Sujatha Manubothula for 20 years. Sujatha Manubothula is a housewife.

Sujatha Manubothula lives in Thimmampet, Telangana with children. She is suffering from lymphoma Cancer for more than a year.

He is receiving medication at Basavatarakam Indo American Cancer Hospital & Research Institute Hyderabad, Telangana but not yet admitted. Until now, they've spent about Rs. 150000.

They've arranged the amount from savings & loans. In the next 30 days, they need Rs.350,000 more for further treatment. Please come forward to support my cause. Any contribution will be of immense help. Do contribute and share this campaign link with your friends and family.


ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు. మనుబోతుల. సుజాత. వయస్సు 22 సం!! లు. గ్రా!! తిమ్మంపేట మం!!దుగ్గొండి. జి!! వరంగల్ రూరల్ . భర్త.కీ.శే. మనుబోతుల. సుమన్. ఈమెకు 6 సం!!లు 3 సం!!ల వయసు కలిగిన ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సుజాత భర్త ట్రాక్టర్ తిరగబడి,బోల్తాపడి 2017 లో చనిపోయాడు.ఇంటి యజమానిని కోల్పోవడం మరియు నిరుపేద కుటుంబం కావడం చేత కుటుంబాన్ని పోషించు కోలేని దీన స్థితిలో ఉన్నది. ఇంత దయనీయ స్థితిలో ఉన్న సుజాతకు మరో దారుణమైన సమస్య వెంటాడుతుంది.అదే అంతుచిక్కని గడ్డ ఒకటి మెడ భాగంలో తయారైంది. ఈ గడ్డ కు సంబంధించి గతంలో Govt.MGM హాస్పిటల్ వరంగల్ లో ఒకసారి ఆపరేషన్ కూడా జరిగింది, అయినా మళ్లీ ఆ గడ్డ అతి తక్కువ కాలంలో తిరిగి విపరీతమైన పరిమాణంలో పెరుగుతూ వచ్చింది. మళ్లీ MGMలో ఇంతకుముందు సర్జరీ చేసిన డాక్టరును కలిస్తే హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గాని, MNJ క్యాన్సర్ హాస్పిటల్ కానీ వెళ్ళమని సూచించారు. పలుమార్లు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు డాక్టర్ అన్ని రకాల టెస్టులు చేసి, ఈసమస్యను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అని, అది ఆరోగ్యశ్రీకి వర్తించదని గడ్డ చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నదని చెప్పారు. ఆ గడ్డచుట్టూ రక్తనాళాలు అల్లుకుపోయి ఆపరేషన్ చేయుటకు చాలా కష్టతరంగా ఉంటదని డాక్టర్స్ చెబుతున్నారు.
ఈ ఆపరేషన్ చేయాలంటే 1.జనరల్ సర్జన్,2.గడ్డ రక్తనాళాలను అల్లుకుపోయింది, కనుక ఆపరేషన్ చేసే క్రమంలో రక్తనాళాలు కోత పడినా ఈ క్రమంలో సరిచేయడానికి రక్తనాళాల (Vascular) సర్జన్, 3. ఆపరేషన్ జరిగిన చోట స్కిన్ తో కప్పి వేయుటకు ప్లాస్టిక్ సర్జన్ ఇలా కనీసం ముగ్గురు డాక్టర్స్ అందుబాటులో ఉన్న హాస్పిటల్లో మాత్రమే ఈ ఆపరేషన్ జరుగుతుంది అన్నారు, కానీ ఈ ముగ్గురు స్పెషలిస్ట్ లు ఒకే దగ్గర బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కానీ, MNJ క్యాన్సర్ హాస్పిటల్ లో గాని అందుబాటులో లేరు. బయటనుండి డాక్టర్స్ ని ఆపరేషన్ కోసం పిలిపించాలంటే చాలా ఖర్చుతో కూడిన సమస్య. బసవతారకం హాస్పిటల్ లో ఆపరేషన్ చేయాలంటే కనీసం 3,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని, సమస్య క్రిటికల్ గా ఉంటే ఇంకా ఆపరేషన్ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
కరోన లాక్డౌన్ వల్ల టెస్టుల నిమిత్తం హైదరాబాద్ కు ఏడు సార్లు వెళ్లి రావడానికి 35,000 రూపాయలు ఖర్చు అయినవి.సుజాత ఆరోగ్య పరిస్థితి,ఆర్థిక పరిస్థితిని గమనించిన
K.S.R మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ గౌ!!.శ్రీ.నరహరి రాజేందర్ రెడ్డి సార్ గారు మంచి మనసుతో 5000 రూ!!ఆర్థిక సహాయం తో పాటుగా రెండుసార్లు తన సొంత కారు  ఇచ్చి, సొంత ఖర్చులతో సుజాతను హైదరాబాద్ కి టెస్ట్ ల కోసం పంపించారు .
తరుచూ సుజాత ను పరామర్శిస్తూ, వచ్చిన ప్రతిసారి ఖర్చుల నిమిత్తం 500 రూపాయలు, తినడానికి పండ్లు,బిస్కెట్స్ జావా పౌడర్ ఇచ్చి వెళ్తూ ఉండేవారు.
కావున అందరూ సుజాత మీద దయ చూపించి సుజాత కు ఆర్థిక సహాయం అందించి, తనని బ్రతికించి, తన పిల్లలకు మరియు ఆ కుటుంబానికి అండగా నిలబడి చేయూతనిచ్చి, ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ విషయాన్ని తెలియజేసి తన ప్రాణాన్ని కాపాడవలసిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను.
ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు ఈ క్రింది అకౌంట్ కు డబ్బులు పంపించగలరు.

Read More

Know someone in need of funds for a medical emergency? Refer to us
support