Help venkatesh (cardiac pateient) his family and trust | Milaap
Help venkatesh (cardiac pateient) his family and trust
1%
Raised
Rs.12
of Rs.1,00,00,000
1 supporter
 • aruri

  Created by

  aruri priyaa
 • AV

  This fundraiser will benefit

  Aruri Venkatesh

  from Hyderabad, Telangana

Story

శ్రీయుత గౌరవనీయులైన పూజ్య సమానులైన గౌరవ పెద్దలందరికి చేతులెత్తి నమస్కరిస్తూ వ్రాయునది ఏమనగా?                                ఆర్యా !                                   విషయం :- సార్, మేడం నా పేరు A.శివాణి నేను కూకట్ పల్లి లో ఉంటాను. నేను B.com కంప్యూటర్ చదివినాను నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తను కూడా డిగ్రీ చదువుకున్నాడు. వృత్తి రీత్యా మా డాడీ సౌత్ సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసినాడు అలాగే మా మమ్మి సోషల్ వర్కర్. మా మమ్మి, డాడీ అమ్మ నాన్నలు అనాధలుగా పెరిగి ఎంతో కష్టపడి పైకి వచ్చినారు. తల్లి,తండ్రిలేని పిల్లలు మా లాగా కష్టపడకూడదనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే " మాతృదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ " అనే అనాధ శరణాలయము. 4-1-2014 రోజున స్థాపించటం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన సొంతం ఇల్లు అమ్ముకుని అనాధ పిల్లల ఆశ్రమాన్ని కొనసాగించినారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఎంతో మందికి సేవలు అందించినారు కష్టాలలో పేదవారికి బియ్యం, ఉప్పులు, పప్పులు తోచిన ఆర్ధిక సహాయం చేసేవారు. కానీ ఇలాగైతే కొంత మందికే సహాయం చేయగలుగుతున్నాము మరిన్ని సేవలు అందించాలంటే అధికారికంగా ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మరి కొంతమందికి సేవ చేయాలనే సంకల్పంతో 4-1-2014 నాడు మాతృదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ ను రిజిస్టర్ చేయించారు మా మమ్మి డాడీ. అప్పటి నుంచి అనాధ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించినారు, పేదల పెళ్లిళ్లకు ఆర్ధిక సహాయం చేసినారు మరియు ప్లాట్ ఫారం పైన దిక్కు మొక్కు లేకుండ అడుక్కుతింటున్న వృద్దులకు మొబైల్ సర్వీస్ ద్వారా ఆహార పొట్లాలు, మరియు కప్పుకోవడానికి దుప్పట్లు అందచేసి వారి యొక్క సేవా నిరతిని చాటుకున్నారు మా మమ్మి, డాడీ. మా ఇంటిలో రోజుకు కనీసం 4, 5,గురు భోజనం చేసేవారు. ఇంటిముందుకు వచ్చి అన్నం అడిగే బిచ్చగాళ్లను ఇంటిలోకి పిలిచి అన్నం పెట్టి ఆదరించే దయాగుణం మా మమ్మీది. మాకు ఉన్న దానిలో మా డాడీకి వచ్చే జీతం నుంచే ఇతరుల కష్టాలు మా కష్టాలు అనుకుని ఎంతోమంది పేద ప్రజలకు అన్నదానం, వస్త్రదానాలు చేసి వారి ఆనందమే మా ఆనందంగా భావించి సంతోష పడేవారు మా మమ్మి, డాడీ. ఇలా సంతోషంగా సాగిపోతున్న జీవన ప్రయాణంలో విధి వక్రీకరించి " హార్ట్ ఎటాక్ " రావటంతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా, సాఫీగా సాగుతున్న అనాధ పిల్లల ఆశ్రమానికి మరియు మా కుటుంబానికి అడ్డుకట్ట పడినాది. ఎందుకంటె మా డాడీకి " హార్ట్ ఎటాక్ " 2 సార్లు రావటంతో అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయినందుకు ఉద్యోగం పోయింది. ఇక అప్పటినుండి కష్టాలు మొదలైనాయి పైసా సంపాదన లేక తినటానికి తిండిలేక అనాధ ఆశ్రమం, మరియు కుటుంబం గడవటమే కష్టమై 2019 డిసెంబర్లో పిల్లలను పక్కకు పెట్టేసారు మమ్మి, డాడీ. నేను మా తమ్ముడు 2019 డిసెంబర్ లో డిగ్రీ కంప్లీట్ చేసినాము. ఏదైనా పని చేస్తామనుకున్న సమయంలో కరోనా రావటంతో ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. మా డాడీకి " హార్ట్ ప్రాబ్లమ్ ", షుగర్ 500లకు పైగా ఉంటుంది. అలాగే మమ్మీకి కూడా షుగర్ 489,నాకు ఆస్తమా, మా తమ్ముడికేమో కిడ్నీలో, మరియు గాల్ బ్లాడర్ లో రాళ్లు వచ్చినాయి ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు. మా డాడీ ఉద్యోగం పోయి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఒకప్పుడు పది మందికి అన్నం పెట్టిన చేతులు మావి ఇప్పుడు అదే అన్నం కోసం రోడ్డు మీద దాతలు పంచే ఆహార పొట్లాల కోసం లైన్ లో నిలపడి అడుక్కుతింటున్నాము. కరోనా రావటంతో ఏ పనులు దొరకక కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుని దాదాపుగా 56 రోజులు ఒకపూట తిని మరోపూట పస్తులున్నాము. ఆ ఒక్కపూట కూడా రోడ్ల మీద దాతలు ఎవరైనా సరుకులు గాని, ఆహార పొట్లాలు పంచితే అనారోగ్యంతో ఉన్న మా మమ్మి, డాడీ కోసం లైన్ లో నిలపడి అన్నం తీసుకువచ్చి వారి కడుపు నింపేదాన్ని. ఏ మాత్రం సిగ్గుపడకుండా దాతలు ఇచ్చే సరుకుల కోసం క్యూ లైన్లో నిలపడి వాటితో మా కడుపులు నింపుకున్న రోజులు అనేకం. ఒకప్పుడు ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన ఈ చేతులు రోడ్డున పడి దేహి అని అడుక్కుతింటున్నాము. ఇంటి కిరాయి కట్టక 6 నెలలు అవుతుంది. ఇంటి ఓనర్ ఇల్లు కాలి చేయమని గోల గోల చేస్తూ బండ బూతులు తిడుతు ఇల్లు కాళీచేయమంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే నేను సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాను దయగల దాతలు ముందుకు వచ్చి బుక్స్ డొనేట్ చేయగలరని ఆశిస్తున్నాను.అలాగే తినటానికి తిండిలేక చాలా అవస్థలు పడుతున్నాము తిండి కోసం ఇంటిలో ఉన్న TV ని అమ్ముకుని కడుపునింపుకున్నాము. మరియు ఇంటి ఓనర్ ఇబ్బంది పెడుతుంటే మా డాడీ బిల్డింగ్ మీద నుండి దూకి చస్తాను అంటే చచ్చిపో అని నీవు చచ్చిపోతే పోలీస్ కేసు అయితే  4 లక్షలు పెట్టుకుని కేసు మాఫీ చేయించుకుంటాను అని అంటుంది. ఇన్ని బాధలు భరించి బ్రతుకాలంటేజీవితం మీద విరక్తి కలుగుతుంది దయచేసి సమాజ హితం కోరే మంచి మనసున్న మారాజులు ఎంతో మంది ఉన్నారు వారందరికీ నా పాదాభివందనాలు.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరే మాకు తల్లి తండ, ్రి ఈ సమాజంలో ఎంతో మంది అనాథలను ఆదుకున్న మేము ఇప్పుడు అదే సమాజం ముందు మేము అనాధలుగా నిలపడ్డాము.            మంచి మనసున్న విశాల హృదయులు మాకు అండగా ఉంటారని మా కష్టాలు మీ కష్టాలుగా అనుకుని మమ్మల్ని ఈ కష్టాలని నరకం నుండి కాపాడాలని మంచి మనసున్న పెద్దలందరికి నా పాదాభి వందనాలు. 22 సంవత్సరాల వయసున్న నేను మా కోసం మా మమ్మి, డాడీ పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకునే శక్తి లేక నా కుటుంబ కష్టాలన్నీ మీ ముందు పెట్టాను దయచేసి ఆదరించి ఆదుకుంటారని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ పాదాభి వందనం చేసుకుంటున్నాను. సహాయం చేయాలనుకునే దాతలు గూగుల్ పే నెంబర్ : 8106424011చేయగలరు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్          🙏🙏🙏🙏🙏🙏

Read More

support